Karimnagar: కరీంనగర్‌లో బతుకమ్మ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు!

Karimnagar: కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేలా లైటింగ్, పారిశుధ్యం, భద్రత ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 14 Oct 2026 10:14 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో బతుకమ్మ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు!

Karimnagar: జిల్లాలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలతోపాటు నగరంలో బతుకమ్మ పండుగకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. మహిళాభివృద్ధి, మెప్మా, డి.ఆర్. డి.ఏ అధికారులు అంగన్వాడి సిబ్బందిని, స్వయం సహాయక సంఘాల సభ్యులను, ప్రజా ప్రతినిధులను, ఉద్యోగులను భాగస్వాములను చేస్తూ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఉన్నారు.

మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు శానిటేషన్, లైటింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బతుకమ్మలు నిమజ్జనం చేసే ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, అక్కడ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని అన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పోలీస్, మెడికల్, యువజన క్రీడా శాఖలు సమన్వయంతో విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, తాగునీరు తదితర వసతులు కల్పించాలని ఆదేశించారు.

మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్... మాట్లాడుతూ నగరంలో బతుకమ్మ ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. నిమజ్జన ప్రాంతాలైన మానేరు నది, మానకొండూర్ కొత్తపల్లి, చెరువులు, చింతకుంట, కాకతీయ కెనాల్ ప్రాంతాల్లో లైటింగ్ శానిటేషన్ సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల కోసం పలు అభివృద్ధి పనులు కూడా చేపట్టినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు షర్మిల, జల కుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN