Karimnagar: పేదల పక్షాన నిలిచిన ప్రజా నాయకుడు పండుగ సాయన్న కలెక్టర్

Karimnagar: కరీంనగర్ ఐడీఓసీలో పండుగ సాయన్న జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అధికారులు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 22 Oct 2026 5:35 PM IST
Karimnagar
X

Karimnagar: పేదల పక్షాన నిలిచిన ప్రజా నాయకుడు పండుగ సాయన్న కలెక్టర్

కరీంనగర్: నిజాం కాలంలో పెత్తందార్ల అన్యాయాలకు, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి ఎంతో మంది పేదలకు అండగా నిలిచిన నిలిచిన మహనీయుడు పండుగ సాయన్న అని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) లో పండుగ సాయన్న జయంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్, డీఆర్వో స్వామి, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, ఇతర అధికారులు, ముదిరాజ్ సంఘం నాయకులు సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్,మాట్లాడుతూ.. సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని దోపిడీ చేస్తున్న దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు డిఆర్ఓ, గ్రంథాలయ సంస్థ చైర్మన్, బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN