Karimnagar: అక్రమ సంబంధాన్ని బయట పెట్టిన భార్య కుటుంబ సభ్యులపై దాడి!

Karimnagar: కరీంనగర్ హనుమాన్ నగర్‌లో వివాహేతర సంబంధం వివాదంపై రాజీకి వెళ్లి ఇరువర్గాలు కట్టెలతో పరస్పరం దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 26 Sept 2026 8:29 PM IST
Karimnagar
X

Karimnagar: అక్రమ సంబంధాన్ని బయట పెట్టిన భార్య కుటుంబ సభ్యులపై దాడి!

కరీంనగర్: అక్రమ సంబంధం వ్యవహారంపై రాజీకి వెళ్లిన ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కరీంనగర్ హనుమాన్ నగరంలో రాజు, లావణ్య దంపతుల కుటుంబాల మధ్య రెండు నెలలుగా వివాదం నడుస్తోంది.

ఈ విషయమై మాట్లాడేందుకు ఇరువర్గాలు సమావేశం కాగా, మాట మాట పెరిగి పరస్పర దాడికి దారితీసింది. ఈ ఉద్రిక్తతలో ఇరువర్గాల వారు కట్టెలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. భార్య లావణ్య కుటుంబ సభ్యులు మాట్లాడడానికి రాగా పథకం ప్రకారమే దాడులకు దిగారని లావణ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN