Karimnagar: కార్మిక హక్కుల కోసం ఉద్యమాలు నిర్మిస్తాం... సీఐటీయూ
Karimnagar: కార్మిక హక్కులు, కనీస వేతనాల పెంపు, ప్రైవేటీకరణ నిలిపివేత, ఎంఎస్ఎంఈల సమస్యలపై ఉద్యమాలు నిర్మిస్తామని కరీంనగర్ వర్క్‌షాపులో సీఐటీయూ నేతలు తెలిపారు.
Karimnagar: కార్మిక హక్కుల కోసం ఉద్యమాలు నిర్మిస్తాం... సీఐటీయూ
కరీంనగర్: సిఐటియు కరీంనగర్ జిల్లా వర్క్ షాపు అధ్యక్షులు యు.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగినది ఈ వర్క్ షాప్ ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం పద్మశ్రీ మాట్లాడుతూ నేడు దేశంలో కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల ప్రభావంతో కుదేలవుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల (ఎం.ఎస్.ఎం.ఇ)లు పరిశ్రమలకు ముడి సరుకుల పెరుగుదల, పెరుగుతున్న విద్యుత్ చార్జీలు, ఆర్థిక ఒత్తిళ్ళు,
స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో కార్మికుల జీవనోపాధిపై ప్రభావం, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, వాటాల అమ్మకం, 4 లేబర్ కోడ్స్ అమలు,విద్యుత్ సవరణ బిల్లు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, విబిజి రామ్ స్కీమ్ రద్దు, కనీస వేతనాల పెంపుదల, ధరల నియంత్రణ తదితర అంశాలతో పాటు ఆర్ధిక, రాజకీయ, సామాజిక సంక్షోభాలను అధిగమించేందుకు తగిన పోరాటాల రూపకల్పన చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్, కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి, ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, మారెళ్ళ శ్రీలత, నలవాల స్వామి, జనగాం రాజమల్లు, జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, జిల్లా కమిటీ సభ్యులు కదిరే రమేష్, కాల్వ సారిక, చల్లా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




