Karimnagar: కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి సీఐటీయూ డిమాండ్

Karimnagar: ఎన్నికల హామీలు అమలు చేయాలని కరీంనగర్‌లో సీఐటీయూ డిమాండ్. కనీస వేతనాలు, లేబర్ కోడ్‌ల రద్దుపై పోరాటానికి నాయకుల పిలుపు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 31 Oct 2026 7:03 PM IST
Karimnagar
X

Karimnagar: కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి సీఐటీయూ డిమాండ్

కరీంనగర్: ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హమీలను ప్రభుత్వం అమలు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈరోజు,రేపు సీఐటీయూ నాయకత్వం, క్యాడర్ శిక్షణ తరగతులు ప్రారంభ సూచికగా జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అనేక సమస్యలు పరిష్కారం కాకపోవటంతో కార్మికులు తీవ్ర ఆసంతృప్తిలో ఉన్నారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రాష్ట్రంలో అమలు చేస్తే వారు మరింత నష్టపోయి వెట్టిచాకిరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే ఆ కోడ్ల అమలు నిర్ణయాన్ని రాష్ట్రంలో నిలుపుదల చేయాలని, ఇతర సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రయివేట్ రంగంలో భారీ,మధ్యతరహా, చిన్న,సూక్ష్మ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలుసవరించాలని విజ్ఞప్తి చేశారు. 15వ ఐఎల్ సీ తీర్మానం,1992 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికుల జీవన వ్యయం లెక్కిస్తే ప్రస్తుతం రూ.42 వేలు కనీస వేతనంగా నిర్ణయించాలని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో నెం.6లో అతి తక్కువ వేతనాలు నిర్ణయించారని తెలిపారు. ఆ వేతనాలను కూడా రాష్ట్రంలో ఎక్కడా, ఏ పరిశ్రమల్లో అమలు చేయడం లేదని తెలిపారు. జీఓ నెం. 6ను అన్ని పరిశ్రమల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భౌగోళికంగా (జోన్స్ ఆధారంగా) నిర్ణయించిన వేతనాల పద్ధతిని రద్దు చేయాలని కోరారు. కార్మిక సంక్షేమ చట్టాలైన కనీస వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్. బోనన్, సెలవులు, రక్షణ సౌకర్యాలు, పని ప్రదేశంలో సౌకర్యాలు పటిష్టంగా అమలు చేసేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు... 'ఆశ, అంగన్వాడీ, ఐకేపీ వివోఎలకు ఫిక్స్ వేతనం రూ.18వేలు ఇవ్వాలి, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేలు కనీస వేతనం ఇవ్వాలి, మల్టీపర్సన్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి, మున్సివల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి, పిఆర్సిని వెంటనే ప్రకటించి అమలు చేయాలి, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.

బీడీ కార్మికులకు కనీస పెన్షన్ రూ.7వేలు ఇవ్వాలి, 55 ఏండ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి, వీఆర్ఏ వారసులకు జీవో నెం.81 ప్రకారం వెంటనే ఉద్యోగాలివ్వాలి, వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డ్లకు లాస్ట్ గ్రేడ్ 4 విధానం అమలు చేయాలి, ప్రభుత్వ మీ-సేవ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి, ఉపాధి హామీ ఫీల్డ్

అసిస్టెంట్ వేతనాలు చెల్లించాలి, వైద్య ఆరోగ్యశాఖలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉ ద్యోగుల సర్వీసులను రెగ్యులైజేషన్ చేయాలి,104 ఉద్యోగుల బకాయి జీతాలు చెల్లించాలి, ఆర్టీసీ కార్మికులకు పెండింగ్లో ఉన్న పీఆర్సీ బకాయిలు చెల్లించడంతో పాటు ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో 23వేల మంది ఆర్టిజెన్స్ సర్వీసులను కన్వర్షన్ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్,ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, నాలువల స్వామి, రాజమల్లు, మరెళ్ల శ్రీలత,జిల్లా కార్యదర్శులు కొప్పుల శంకర్, గుండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR