Karimnagar: స్నూకర్ క్లబ్‌ను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్!

Karimnagar: కరీంనగర్ చైతన్యపురిలో 'ది క్యూ లాంజ్' స్నూకర్ క్లబ్‌ను మేయర్ కొలగాని శ్రీనివాస్, మాజీ మేయర్ సునీల్ రావు ప్రారంభించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 12 Oct 2026 3:59 PM IST
Karimnagar
X

Karimnagar: స్నూకర్ క్లబ్‌ను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్!

కరీంనగర్: కరీంనగర్ చైతన్యపురి కాలనీలోని ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన 'ది క్యూ లాంజ్' (The Cue Lounge) స్నూకర్ క్లబ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి స్నూకర్ క్లబ్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు స్వయంగా స్నూకర్ గేమ్ ఆడుతూ కొంత సమయం ఉత్సాహంగా గడిపారు. నగర ప్రజలకు, ముఖ్యంగా యువతకు రిక్రియేషన్, గేమింగ్, రుచికరమైన ఫుడ్ మరియు బెవరేజెస్ మరియు చక్కటి రిలాక్సేషన్ అందించేందుకు ఈ లాంజ్ వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, గాజ శివరాం, సోమిడి వేణు, పెద్దపల్లి జితేందర్, నాయకులు కటకం లోకేష్, స్నూకర్ క్లబ్ యాజమాన్యులు, తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN