Karimnagar: రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో కరీంనగర్ జట్టుకు కాంస్య పతకం!
Karimnagar: రంగారెడ్డిలో జరిగిన 45వ రాష్ట్ర స్థాయి జూనియర్స్ ఖోఖో పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ బాలుర జట్టు కాంస్య పతకం సాధించింది. నరేందర్ రెడ్డి అభినందించారు.
Karimnagar: రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో కరీంనగర్ జట్టుకు కాంస్య పతకం!
Karimnagar: కరీంనగర్ జిల్లా కు 45 వ రాష్ట్ర స్థాయి జూనియర్స్ బాల బాలికల ఖోఖో పోటీలలో బాలుర జట్టుకు కాంస్య పతకం లభించింది.గత మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీలలో ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం నుండి 12 జట్లు తలపడగా ఉమ్మడి
కరీంనగర్ జిల్లాకు కాంస్య పతకం లభించింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బాలుర జట్టును అభినందించడం జరిగింది. భవిష్యత్తులో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి క్రీడలలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వై మహేందర్ రావు,రాష్ట్ర టెక్నికల్ అఫిషియల్ మెంబర్ వంగపల్లి సూర్యప్రకాష్,జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ఐ ఆఫ్ పోలీస్ కుమారస్వామి, జిల్లా భాద్యులు డా.ఎ రవీందర్,కట్ట సంతోష్,యోగేష్ మరియు కోచ్ లు డప్పు రమేష్,వెంకటేష్,దుర్గాదాస్ పాల్గొన్నారు.




