Karimnagar: సేవా సంకల్ప్ అభియాన్: కరీంనగర్‌లో భారీ రక్తదానం

Karimnagar: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ వేళ కరీంనగర్‌లో బీజేవైఎం రక్తదాన శిబిరం, సిబ్స్ అకాడమీ సర్టిఫికెట్ల ప్రదానోత్సవం నిర్వహించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 27 Sept 2026 3:48 PM IST
Karimnagar
X

Karimnagar: సేవా సంకల్ప్ అభియాన్: కరీంనగర్‌లో భారీ రక్తదానం

కరీంనగర్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే పరమావధిగా అహర్నిశలు శ్రమిస్తూ, 25 ఏళ్లుగా ప్రజాసేవలో కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ మార్గనిర్దేశనంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత సామాజిక సేవలో ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు.

ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే రక్తదానం అత్యంత పవిత్రమైన కార్యక్రమం అని, ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెవైఎమ్ కరీంనగర్ ప్రతినిధులను, కార్యకర్తలను అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువకులు, బిజెవైఎమ్ నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.

"మహిళలు ఆత్మవిశ్వాసం, స్వయంకృషితో ఆర్థిక స్వావలంబన సాధించాలి...

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు"సక్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ సొల్యూషన్స్ (SIBS) బ్యూటీ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్టిఫికేషన్ ప్రదానోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ, గత పదేళ్లుగా స్వప్న గారు 'సిబ్స్' ఇన్స్టిట్యూట్ ద్వారా దాదాపు 2,500 మందికి పైగా మహిళలకు బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ ఇచ్చి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి స్వయం ఉపాధి పొందేలా తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు.

మహిళలు తాము ఎంచుకున్న వృత్తిపై నమ్మకంతో, ధైర్యంతో ముందుకెళ్లినప్పుడే ఆశించిన విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గతంలో 1982 ప్రాంతంలో బ్యూటీ రంగాన్ని ప్రారంభించినప్పుడు సమాజంలో పలువురు చిన్నచూపు చూసినప్పటికీ, పట్టుదలతో శ్రమించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మహనీయుల విజయాన్ని ఈ సందర్భంగా ఉదాహరణగా గుర్తుచేశారు.

ఏ రంగంలోనైనా రాత్రికి రాత్రే లేదా కొద్ది నెలల్లోనే గొప్ప విజయాలు రావు అని, నిరంతర శ్రమ, ఓర్పు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం నేర్చుకునే తత్వం ఉండాలని స్పష్టం చేశారు. స్వప్న గారు ఈ శిక్షణా కార్యక్రమాలను పట్టణాలకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించి, అక్కడ ఉన్న మహిళా సోదరీమణులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. నేటి రోజుల్లో పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా సమాచార సాంకేతికత విస్తరించినందున, ప్రతి ఒక్కరూ లేటెస్ట్ ట్రెండ్స్ పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు.

ఒక కుటుంబం ఆనందంగా ఉండాలన్నా, పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దబడాలన్నా మహిళా సాధికారత అత్యంత కీలకమని, ప్రతి విజయం వెనుక మహిళల పాత్ర అపారమైనదని కొనియాడారు. ఇన్స్టిట్యూట్‌లో సర్టిఫికెట్లు పొందిన మహిళలందరూ తాము నేర్చుకున్న విద్యను సద్వినియోగం చేసుకుంటూ సొంతంగా బ్యూటీ పార్లర్లు, సంస్థలు స్థాపించి మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎస్.ఐ.బి.ఎస్ సంస్థ నిర్వాహకురాలు స్వప్న, నాయకులు మార్శెట్టి గోపాల్, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, డాక్టర్ పద్మజ, ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు, సభ్యులు, మరియు పెద్ద సంఖ్యలో శిక్షణ పొందిన మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు.

కార్యక్రమం అనంతరం, హాజరైన వారందరూ కలిసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 138వ 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని వీక్షించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు గుజ్జ శ్రీనివాస్, చొప్పరి జయశ్రీ, పొన్నం మొండయ్య, మాసం గణేష్, గాజె శివరాం, ఎన్నం ప్రకాష్, బిజెపి జోన్ అధ్యక్షులు అవదుర్తి శ్రీనివాస్, తణుకు సాయికృష్ణ, పాదం శివరాజ్ బండారి గాయత్రి, బీజేపీ నాయకులు చంద్రమౌళి, చాడ ఆనంద్, గర్థస్ సతీష్, అడిచెర్ల రాజు, గుంజెటి శివకుమార్, పండుగ నాగరాజు, నక్క ప్రమోద్, కడర్ల విమల్ కుమార్, వెంకటేష్ అన్నాజీ, వీనీత్ గున్నాల, కన్నంబ అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN