Karimnagar: ఎస్టీ మోర్చా కార్యవర్గాన్ని ప్రకటించిన శ్రీనివాస్ నాయక్!
Karimnagar: కరీంనగర్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గాన్ని అధ్యక్షుడు రమావత్ శ్రీనివాస్ నాయక్ ప్రకటించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Karimnagar: ఎస్టీ మోర్చా కార్యవర్గాన్ని ప్రకటించిన శ్రీనివాస్ నాయక్!
కరీంనగర్: భారతీయ జనతా పార్టీ ఎస్టి మోర్చా కరీంనగర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షుడు రమావత్ శ్రీనివాస్ నాయక్ సోమవారం రోజున నూతన జిల్లా కార్యవర్గ ప్రకటన విడుదల చేశారు.
ఉపాధ్యక్షులు గా బిజిలి సారయ్య,మాలోతు శ్రీనివాస్ నాయక్ ,లావుడ్య తిరుపతి నాయక్, బిజిలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా,విస్లావత్ శ్రీనివాస్ నాయక్, మొగిలి శ్రీనివాస్ కార్యదర్శులు గా బానోతు శివ, గుగులోత్ శ్రీకాంత్, లకావత్ శేఖర్, కట్ల సంపత్ ,మీడియా కన్వీనర్ గా గుగులోత్ వంశీ,సోషల్ మీడియా కన్వీనర్ గామాలోత్ దీక్షిత్ ,ఐటి కన్వీనర్ గా మానుపాటి కుమార్,ఆఫీస్ సెక్రటరీ గా భూక్య హరి, మన్ కీబాత్ కన్వీనర్ గా బిజిలి కిషన్ కార్యవర్గ సభ్యులుగా లావుడ్య బిక్షపతి ,ఇస్లావత్ రవి, కెమసారం స్వామి,
లావుడ్య సోమన్న ,కున్సోత్ శ్రీనివాస్ నియమితులయ్యారు. నూతనంగా నియమితులైన జిల్లా కార్యవర్గ సభ్యులందరూ జిల్లాలో ఎస్టీ మోర్చా, బిజెపి బలోపేతానికి తగిన కృషి చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను అభివృద్ధిని , ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభ్యున్నతి కోసం చేస్తున్న నిరంతర కృషిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి తగిన కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు రమావత్ శ్రీనివాస్ ఈ సందర్భంగా సూచించారు.




