Karimnagar: ఈద్గా వద్ద అల్లర్లకు కుట్ర.. కలెక్టర్, సీపీకి బీజేపీ ఫిర్యాదు

Karimnagar: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా ఈద్గా వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణంతో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ అదనపు కలెక్టర్, సీపీకి బీజేపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 14 Nov 2026 10:06 PM IST
Karimnagar
X

Karimnagar: ఈద్గా వద్ద అల్లర్లకు కుట్ర.. కలెక్టర్, సీపీకి బీజేపీ ఫిర్యాదు

కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండానే ఈద్గా వద్ద రిటైనింగ్ వాల్ కట్టి, మొక్కలు నాటి మత విద్వేషాలు రగిలించాలని కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ కార్పొరేటర్లు జిల్లా అదనపు కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడే, నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ను కోరారు.

ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందున్న ఈద్గా వద్ద కొందరు వ్యక్తులు మూడు రోజుల క్రితం (2026 నవంబర్ 11న) రిటైనింగ్ వాల్ కట్టేందుకు కంకర, ఇసుకను తీసుకొచ్చి జేసీబీతో పనులు ప్రారంభించారని ఫిర్యాదు చేశారు.

అక్కడే మొక్కలు నాటాలని యత్నించారని పేర్కొన్నారు. ఈ పనులకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేదని, కనీసం అనుమతి కూడా కోరలేదని గుర్తు చేశారు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య మత విద్వేషాలు రగిలించి గొడవలు స్రుష్టించేందుకు కుట్ర చేసినట్లు కన్పిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేత హస్తం ఉన్నట్లు భావిస్తున్నట్లు తెలిపారు.

తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసి కరీంనగర్ లో గొడవలు స్రుష్టించి విద్వేషాలు రగిలించి బీజేపీని బదనాం చేయడమే లక్ష్యంగా సదరు వ్యక్తులు ఈ కుట్రకు తెరదీసినట్లు ఆరోపించారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఏ ఉద్దేశంతో ఈ కుట్రకు తెరదీశారో సమగ్ర విచారణ జరపాలని కోరారు. మత విద్వేషాలు రగిలించి కరీంనగర్ లో అల్లర్లు స్రుష్టించాలని కుట్ర చేసిన వ్యక్తులపై తక్షణమే నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు.

ప్రశాంతమైన కరీంనగర్ లో ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఝప్తి చేశారు. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్, కార్పొరేషన్ విప్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కర్యదర్శి . ఉప్పరపల్లి శ్రీనివాస్ తదితరులు అదనపు కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను కలిసిన కోరారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR