Karimnagar: అవినీతికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్సే: బీజేపీ కార్పొరేటర్లు!
Karimnagar: కేంద్రమంత్రి బండి సంజయ్ మాటలను వక్రీకరించి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నేత చల్ల హరిశంకర్పై కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్లు బండారి వేణు, సోమిడి వేణు మండిపడ్డారు.
Karimnagar: అవినీతికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్సే: బీజేపీ కార్పొరేటర్లు!
కరీంనగర్: గత బీఆర్ఎస్ పాలకవర్గంలో కొంత మంది చేసిన అవినీతిని ఆధారంగా మా నాయకులు బండి సంజయ్ కుమార్ బిజేపి పార్టీ అంతర్గత సమావేశంలో మా పాలకవర్గానికి హితబోధ, దిశానిర్దేశం చేసిన మాటలను వక్రీకరించి, బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ నిరాధారమైన ఆరోపణలతో మా పాలకవర్గానికి అవివీతిని అంటగట్టే ప్రయత్నం చేయడం సిగ్గు చేటని భారతీయ జనతా పార్టీ కార్పోరేటర్లు బండారి వేణు, సోమిడి వేణు విరుచుకు పడ్డారు.
కరీంనగర్ లో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ చేసిన వాఖ్యలను ఖండిస్తూ ఫైర్ అయ్యారు. ఈ సంధర్బంగా బిజేపి కార్పోరేటర్ బండారి వేణు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకవర్గంలో అవినీతిని, అలాంటి కొంత మంది కార్పోరేటర్లను పెంచి పోషించింది మీ నాయకుడు కాదా అని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ పాలకవర్గ పరిపాలనలో కొంత మంది కార్పోరేటర్లు అవివీతి, భూకబ్జాలకు పాల్పడి, ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన చరిత్ర మరిచిపోయారా అని విరుచుకు పడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ నాయకుడి పాలకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాలు భూకబ్జాలను దృష్టిలో పెట్టికొని మా నాయకులు బండి సంజయ్ కుమార్ మా పాలకవర్గానికి, పార్టీ నాయకులకు హితబోధ, దిశానిర్దేశం చేస్తే దాన్ని వక్రీకరించి , నిరాధారమైన ఆరోపనలతో మా పాలకవర్గం పై బట్టకాల్చి మీద వేయడం చాలా సిగ్గు చేటని ద్వజమెత్తారు. మా నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మా పాలకవర్గానికి గతంలో కొంత మంది కార్పోరేటర్లు అవినీతి చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. ప్రజలు మనలను నమ్మి మన పార్టీకి, పాలకవర్గానికి పట్టం కట్టారు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండ మంచి పరిపాలన అందించి... నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగిందని స్పష్టం చేశారు.
అట్టి వాఖ్యలను బీఆర్ఎస్ మాజీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ అరకాలు, చవకాలు, నిరాధర ఆరోపణలతో మా పాలకవర్గం పై అవినీతి మచ్చ వేయడం చాలా దుర్మార్గం అన్నారు. గత పది సంవత్సరాల పాలకవర్గ పరిపాలనలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని ద్వజమెత్తారు. గతంలో కొంత మంది బీఆర్ఎస్ డబ్బుల కోసం ఇసుక, రాయి, కంకర, తట్టలు, పారలు ఎత్తుకచ్చి ప్రజలను ఇబ్బందులు పెట్టిన చరిత్ర మరిపోయారా...? అని ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వకపోతే కట్టుకున్న కంపోండ్, నివాస గృహాలను కూల్చే బుల్డోజర్లను మీ నాయకుడు తయారు చేశారని ద్వజమెత్తారు.
డబ్బుల కోసం కొంత మంది అవినీతి కార్పోరేటర్లతో గ్యాంగ్ తయారు చేసింది వాస్తవం కాదా...? అని ప్రశ్నించారు. మీ పాలకవర్గ ఆయాంలో కొందరు కార్పోరేటర్లు అరాచకలు చేసి... జైలు పాలయ్యారో మీకు తెలియదా అని ప్రశ్నించారు. మీ నాయకుని వద్ద ఉనికిని చాటుకునేందుకు మా నాయకులు, మా పాలకవర్గం పై ఆరోపణలు చేయడం చాలా దుర్మార్గం అని మండి పడ్డారు. నిరాధారమైన ఆరోపనలతో మా పాలకవర్గం, మా నాయకుల పై వాఖ్యలు చేస్తే ఊరుకోమని.. తస్మత్ జాగ్రత్తా అని హెచ్చరించారు.
గత బీఆర్ఎస్ పాలనలో మీ నాయకులు రోడ్లు, జంక్షన్లలో అవినీతే... ఎక్కడ చూసినా అవినీతే అని... అలాంటిది హరిశంకర్ మీరు అవినీతి గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఎక్కడ చూసినా మీ నాయకుడు అవినీతికి పాల్పడ్డారని ద్వజమెత్తారు. అవినీతి చేసి జైలు కెళ్ళిన కార్పోరేటర్లను జైల్లో కలిసి పరామర్శించిన నీచ చరిత్ర మీ నాయకుడిదని ద్వజమెత్తారు. అవినీతి నాయకులకు కొమ్ము కాసి... లక్షల డబ్బులు ఇచ్చి విదేశాలకు పంపిన చరిత్ర మీ నాయకుడిదని విరుచుకు పడ్డారు.
అలాంటి అవినీతి కార్పోరేటర్లు, నాయకుల కోసం లీగల్ అజ్వైజర్ కమిటిని నియమించడం సిగ్గమాలిన చర్య అని మండి పడ్డారు. మా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మా పాలకవర్గానికి నెలకు ఒక సారి ప్రత్యేక సమావేశంలో దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. మీ లాగా... మీ నాయకుడిలా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం మా పాలకవర్గానికి తెలియదన్నారు. నగర ప్రజలకు మంచి సుపరిపాలన అందించాలన్నదే మా పాలకవర్గం, మా నాయకుడి లక్ష్యం అని తెలిపారు.
ఈ సందర్భంగా సోమిడి వేణు మాట్లాడుతూ... కేంద్ర మంత్రి బండి సంజయ్ కూమార్ మా నాయకులు మా పాలకవర్గానికి ప్రతి నెల మంచి చెడు, మంచి పరిపాలన, నగర అభివృద్ధి పై దిశానిర్దేశం చేస్తారని స్పష్టం చేశారు. అలాంటి సమావేశంలో వాఖ్యలను బీఆర్ఎస్ మాజీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆరోపణలు చేయడం దుర్మార్గం అన్నారు. మమ్మల్ని ప్రజల సేవ కోసం నాయకులుగా తయారు చేసిన మా నాయకులు మాకు దిశానిర్దేశం చేస్తే.... మా పాలకవర్గానికి అవినీతి అంటగట్టడం సిగ్గు చేటని మండి పడ్డారు.
గతంలో బీఆర్ఎస్ కార్పోరేటర్లు ప్రతి నివాసం వద్ద డబ్బులు వసూలు చేశారని ప్రజలు గమనించే మా బీజేపి పాలకవర్గానికి పట్టం కట్టారని తెలిపారు. మా నాయకులు బండి సంజయ్ కూమార్ గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపు నిచ్చారని తెలిపారు. అవివీతి అనే పదానికి పర్యాయ పదాలు ఉంటే దానికి కేర్ ఆఫ్ హరిశంకర్, రవీంధర్ సింగ్ లే అని మండి పడ్డారు.
గతంలో చల్ల హరిశంకర్ నగరపాలక సంస్థ కాంట్రాక్టు జౌట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్టు పేరుతో జీతాలు ఇచ్చింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఆ కాంట్రాక్టు పేరుతో అవినీతికి పాల్పడి నగరపాలక సంస్థను దోచుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు. అవినీతి చేసి సంపాదించిన మీరు అవినీతి అక్రమాల పై మాట్లాడటం సిగ్గు చేటని ద్వజమెత్తారు. మా పాలకవర్గం పై మా నాయకుల పై నిరాధారమైన ఆరోపనలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
ఈ మీడియా సమావేశంలో బీజేపీ కార్పోరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు.. తాటి ప్రభావతి , దేశ శిల్ప వేదం , పెద్దపల్లి శ్రీలేఖ జితేందర్ , బండ రమణ రెడ్డి ప్రకాష్ , వంగల పవ,న్ మేకల వెంకటేష్, భూపతి రవీందర్, కే ఏ పిపి చంద్ర , కన్నకృష్ణ కర్రే పద్మా అనిల్ , కొంపల్లి రమన్, తోట అనిల్ , మాసం గణేష్ సత్యం గొట్టా ముక్కల రమణ , గాజా శివరాం,ముజీబ్ ,నందు తదితరులు పాల్గొన్నారు.




