Karimnagar: కరీంనగర్ అలుగునూర్ చౌరస్తాలో ఫ్లెక్సీల వివాదం.. ఉద్రిక్తత!

Karimnagar: కరీంనగర్ జిల్లా అలుగునూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి, కాంగ్రెస్ ఫ్లెక్సీలకు అడ్డుగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ANJANEYULU, MANAKONDURU
Published on: 28 Nov 2026 10:43 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ అలుగునూర్ చౌరస్తాలో ఫ్లెక్సీల వివాదం.. ఉద్రిక్తత!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా అలుగునూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా బిఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, కాంగ్రెస్ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీకి అడ్డుగా బిఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ఫ్లెక్సీలను తొలగిస్తామని కాంగ్రెస్ నాయకులు పట్టు పట్టడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా గంటలోగా బిఆర్ఎస్ నాయకులతో ఫ్లెక్సీలు తొలగించాలని లేనిపక్షంలో మున్సిపాలిటీ వారితో తొలగింపజేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్.

అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీని కరీంనగర్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. అలుగునూరు చౌరస్తాకు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్, తిమ్మాపూర్ సిఐ అనిల్ చొప్పదండి సీఐ ప్రదీప్, ఎస్సైలు నరేందర్ రెడ్డి, అరుణ్, జగదీష్ తిరుపతి తో పాటు పోలీస్ బందోబస్తు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU