Karimnagar: డంప్‌యార్డ్‌కు వ్యతిరేకంగా బతుకమ్మ ఆడుతూ నిరసన!

Karimnagar: డంప్‌యార్డ్ పొగ వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని కరీంనగర్ అలకాపురి మహిళలు వినూత్నంగా బతుకమ్మ ఆడుతూ నిరసన తెలపడం చర్చనీయాంశంగా మారింది.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 14 Oct 2026 10:05 AM IST
Karimnagar
X

Karimnagar: డంప్‌యార్డ్‌కు వ్యతిరేకంగా బతుకమ్మ ఆడుతూ నిరసన!

Karimnagar: డంప్ యార్డ్ నుండి వచ్చే పొగ వలన అలకాపూరి వాసులందరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాం అని వినూతనంగా నిరసనను తెలిపారు. అలకాపురి కాలనీ మహిళలందరూ కలిసి డంప్ యార్డ్ హటావో స్లోగన్ తో బతుకమ్మ ఆడుతూ నిరసన ని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఈ సమస్య మా ఒక్కరిది కాదని కరీంనగర్ ముత్తానిదని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ప్రభుత్వం సూచించాలని కోరారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యపై పోరాటం చేస్తున్న ఎక్కడా పరిష్కారం లభించడం లేదని అనేక వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకుతుందని, నీటి కాలుష్యం వాయు కాలుష్యం వల్ల సంవత్సరంలో సగం రోజులు ఆస్పత్రిలో చుట్టు తిరగడమే సరిపోతుందని తెలిపారు.ప్రస్తుత పరిస్థితులలో

వాతావరణం లో వచ్చిన మార్పు వల్లనే అనేక ఆరోగ్య సమస్యలుఎదుర్కొంటున్నాం దానికి తోడు ఈ విష వాయువు వల్ల కాలనీ మహిళలం బతుకమ్మ కూడా ఆడలేని పరిస్థితి నెలకొంది. మేము ఎన్ని సార్లు ధర్నాలు చేసిన ఎంత మంది అధికారులను మరియు నాయకులను కలసిన ఏదో నామ మాత్రపు చర్యలతో సమస్యను క్లియర్ చేస్తున్నారు కాని శాశ్వత పరిష్కారం చూడట్లేదని అందుకే ఈరోజు బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నామని రాబోవు రోజుల్లో కూడా ఈ నిరసనను కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పండగ తర్వాత కూడా మా నిరసన కొనసాగుతుందని డంపు యార్డు తరలించేంతవరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని దీనికి అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చదవచోటి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అలకాపురి కాలనీ మహిళలతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN