Karimnagar: ప్రజావాణి ఫిర్యాదుపై పాఠశాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
Karimnagar: కరీంనగర్ హుస్సేనిపుర ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ డా. అశ్విని తనాజీ వాకాడే. మౌలిక వసతుల పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశం.
Karimnagar: ప్రజావాణి ఫిర్యాదుపై పాఠశాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
కరీంనగర్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదుపై జిల్లా అదనపు కలెక్టర్ డా. అశ్విని తనాజీ వాకాడే మంగళవారం కరీంనగర్‌లోని హుస్సేనిపుర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించి, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను త్వరితగతిన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.




