Karimnagar: కరీంనగర్ టీటీడీ కళ్యాణ మండపంలో 5వ కార్తీక దీపోత్సవం
Karimnagar: నవంబర్ 29న కరీంనగర్ టీటీడీ కళ్యాణ మండపంలో 5వ కార్తీక దీపోత్సవం; భక్తులకు ఉచిత పూజా సామగ్రి, భజనలు, భరతనాట్యం ఏర్పాట్లు వెల్లడించిన సమితి అధ్యక్షులు.
Karimnagar: కరీంనగర్ టీటీడీ కళ్యాణ మండపంలో 5వ కార్తీక దీపోత్సవం
కరీంనగర్: కరీంనగర్ లోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో 'కార్తీక దీపోత్సవ సమితి - కరీంనగర్' వ్యవస్థాపక అధ్యక్షులు పి. సుగుణాకర్ రావు పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ నెల 29వ తేదీ, ఆదివారం సాయంత్రం 5:00 గంటలకు ఇదే టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో 5వ కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ."మన సంస్కృతి సంప్రదాయాల్లో హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. గత ఐదేళ్లుగా కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ వేడుకను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నాం. బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ మార్గదర్శనంలో పవిత్ర టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఈ ఆధ్యాత్మిక ఉత్సవాన్ని ఏర్పాటు చేశాము" అని తెలిపారు.
కార్యక్రమ విశేషాల గురించి ఆయన వివరిస్తూ:
అందరికీ దీపారాధన అవకాశం: టిటిడి కళ్యాణ మండప ప్రాంగణాన్ని అంతా సుందరంగా అలంకరించి, వేడుకకు విచ్చేసిన భక్తులందరూ స్వయంగా దీపారాధన చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాము.
ఉచిత పూజా సామగ్రి: దీపారాధనకు అవసరమైన ప్రమిదలు, నూనె, ఒత్తులను మా నిర్వాహక బృందమే భక్తులకు ఉచితంగా అందిస్తుంది. భక్తులు కేవలం ఆధ్యాత్మిక భావనతో హాజరు కావాలి అని విజ్ఞప్తి చేశారు.
సాంస్కృతిక & ఆధ్యాత్మిక కార్యక్రమాలు: ఈ దీపోత్సవంలో భాగంగా భజన బృందాలచే భజనలు, భరతనాట్యం వంటి వివిధ కళాత్మక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
"ఈ మహా దీపోత్సవంలో మహిళా సోదరీమణులు, భజన బృందాలు, ఆధ్యాత్మిక సంఘాలు, గణేష్ మరియు దుర్గామాత మండప నిర్వహణ కమిటీలు, వివిధ ఆలయ కమిటీల సభ్యులు మరియు కరీంనగర్ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని పి. సుగుణాకర్ రావు గారు కోరారు.
ఈ కార్యక్రమంలో కార్తీక దీపోత్సవ సమితి సభ్యులు గంప జగన్, దుర్గ మారుతి, తాడూరి బ్రహ్మం, పిట్ల స్వామి, కామారపు నరహరి, ములుగురి కిషోర్, ముప్పుడి సునీల్ ఈగ మల్లేశం, ఏవి సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.




