Karimnagar: హామీని నెరవేర్చడమే నా ధ్యేయం: కార్పొరేటర్ కిరణ్!

Karimnagar: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 27వ డివిజన్ పరిధిలో సొంత నిధులు రూ.లక్షతో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను కార్పొరేటర్, 3 టౌన్ సీఐ తీర్మాల్ గౌడ్ ప్రారంభించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 16 Oct 2026 6:37 PM IST
Karimnagar
X

Karimnagar: హామీని నెరవేర్చడమే నా ధ్యేయం: కార్పొరేటర్ కిరణ్!

కరీంనగర్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తమ ప్రధాన బాధ్యత అని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల - తంగెళ్ల కిరణ్ కుమార్ (టిల్లు) స్పష్టం చేశారు. డివిజన్‌లో ప్రజల రక్షణ, భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తన స్వంత డబ్బులు ₹1,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను శుక్రవారం రోజున కరీంనగర్ 3 టౌన్ సీఐ (CI) తీర్మాల్ గౌడ్ తో కలిసి కార్పొరేటర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ బొట్ల శ్యామల - తంగెళ్ల కిరణ్ కుమార్ (టిల్లు) మాట్లాడుతూ...ఎన్నికల సమయంలో డివిజన్ ప్రజలకు భద్రతపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. 27వ డివిజన్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరియు రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తాను. డివిజన్ ప్రజల సహకారంతో మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లోనూ మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాను అన్నారు.

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న 3 టౌన్ సీఐ తీర్మాల్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల భద్రతే పోలీసు వ్యవస్థకు ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. డివిజన్‌లో నేరాల నియంత్రణకు, అనుమానాస్పద కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గుర్తించడానికి మరియు ప్రజలకు మరింత రక్షణ కల్పించడానికి ఈ సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కార్పొరేటర్‌ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ ప్రజలు, కాలనీ పెద్దలు, యువకులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN