Karimnagar: ఐఈఏ 109వ వార్షిక సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించిన శాతవాహన వీసీ
Karimnagar: కరీంనగర్ శాతవాహన వర్సిటీలో ఐఈఏ 109వ వార్షిక సదస్సు బ్రోచర్ ఆవిష్కరించారు. డిసెంబర్‌లో జరగనున్న ఈ సదస్సు తేదీలు, వివరాలు వెల్లడించారు.
Karimnagar: ఐఈఏ 109వ వార్షిక సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించిన శాతవాహన వీసీ
కరీంనగర్: భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మమైన ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ 109వ వార్షిక సదస్సు ప్రతిని శాతవాహన ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య . పి. సతీష్ కుమార్ తో కలిసి, అర్థశాస్త్రసదస్సు లోకల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, కాకతీయ ఆచార్యులు సురేష్ లాల్, శాతవాహన అర్థశాస్త్ర విభాగపు అధిపతి, అసోసియేషన్ తెలంగాణ కార్యనిర్వాక సభ్యురాలు డా. శ్రీవాణి, డీన్ ఫ్యాకల్టీ సోషల్ సైన్స్ ఆచార్య వరప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య బి . సురేష్ లాల్ మాట్లాడుతూ ఈ సదస్సు 2026, డిసెంబర్ 27, 28, 29 తేదీలలో కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, హాజరయ్యే వారు ఐఇఎ వెబ్సైట్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అక్టోబర్ 25 వరకు రిజిస్ట్రేషన్ చివరి తేదీ అని, వివిధ అంశాలపై పరిశోధన పత్రాలు అక్టోబర్ 5 వ తేదీ వరకు సమర్పించాలని, కేవలం "తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలపై అక్టోబర్ 30"వరకు పరిశోధనా వ్యాసాలను పంపించాలని దానిని ప్రత్యేకమైన జర్నల్లో ప్రచురిస్తున్నామని వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, విద్యార్థులు వారి వ్యాసాలను సమర్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగపు అధ్యాపకులు డాక్టర్.ఎ. సాంబశివరావు, డాక్టర్. ఎస్. రాజేష్, శాతవాహన విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ డి. సత్యనారాయణ డాక్టర్. కే. విద్యాసాగర్, విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకులు డాక్టర్. ఆఫ్సారీ ఉస్మాని, స్వరూపారాణి, శకుంతల మొదలగు అధ్యాపకులు పాల్గొన్నారు.




