Kamareddy: గడువులోగా ప్రజల సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ ఆశిష్!
Kamareddy: కామారెడ్డి ప్రజావాణిలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 71 అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా ప్రజా సమస్యలను పరిష్కరించి పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు.
Kamareddy: గడువులోగా ప్రజల సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ ఆశిష్!
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి 71 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల వారీగా అధికారులకు అందజేస్తూ, ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ, ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయకూడదని సూచించారు. ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి సారించి, ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను సంబంధిత పోర్టల్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, డిఆర్ఓ పాండు, సీఈవో చందర్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.




