Kamareddy: సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ చైర్మన్ నాగిరెడ్డి
Kamareddy: కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ మండలం కాటేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం; రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని చైర్మన్ నాగిరెడ్డి సూచన.
Kamareddy: సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ చైర్మన్ నాగిరెడ్డి
Kamareddy: పెద్ద కొడప్ గల్ (కామారెడ్డి ) పెద్ద కొడప్ గల్ మండలం లొని కాటేపల్లి గ్రామం లో గురువారం రైతుల సౌకర్యర్థమై చిన్న కొడప్ గల్ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కొనుగోలు కేంద్ర ప్రారంభం సందర్బంగా సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ద్వార ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మాత్రమే రైతులు తమ ధాన్యాన్ని విక్రాయించాలని రైతులు మధ్య దళారులను ఆశ్రయించి మోసపోవద్దని రైతులకు సూచించారు.
రైతులు పండించిన వరి ధాన్యం పంటకు సన్న రకనికి క్వింటల్ కు 2 వేల 461 రూపాయలు, దొడ్డు రకనికి క్వింటలకు గాను 2వేల 441 రూపాయలు మద్దత్తు ధర కల్పించడం జరిగిందని అన్నారు. దింతోపాటు సన్న రకం వడ్లకు క్వింటలకు 5 వందల రూపాయల చొప్పున బోనస్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లెస్తుందని గుర్తు చేశారు.
రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేకన్నా ముందు వడ్లను బాగ అరబెట్టి, శుభ్ర పర్చి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమం లో సొసైటీ కార్యదర్శి హన్మాండ్లు, మండల కాంగ్రెస్ పార్టీ మాజి అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, నాయకులు మల్లప్ప పటేల్, నాగు, గంగారెడ్డి, సాయిలు, కిషన్, పోచయ్య, రవి నాయక్, మల్లేష్, భూమన్న, రసూల్ పాటిల్, హన్మాండ్లు పాటిల్, పాండు నాయక్, భారత్ నాయక్, హాజీ, సాయి ప్రసాద్, నాగన్న, చందా నాయక్, తూకరం తదితరులు పాల్గొన్నారు.




