Kamareddy: లింగాయిపల్లి బాధిత కుటుంబానికి ఎస్ఆర్ ఫౌండేషన్ అండ!

Kamareddy: కామారెడ్డి మండలం లింగాయిపల్లిలో చెరువులో మునిగి తండ్రీకూతుళ్లు మృతి చెందిన ఘటనలో బాధిత సోమిశెట్టి మల్లేశం కుటుంబానికి ఎస్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సాయం అందించింది.

MADHU, KAMAREDDY
Published on: 7 Nov 2026 4:42 PM IST
Kamareddy
X

Kamareddy: లింగాయిపల్లి బాధిత కుటుంబానికి ఎస్ఆర్ ఫౌండేషన్ అండ!

కామారెడ్డి: ఇటీవల కామారెడ్డి మండలం లింగాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో సోమిశెట్టి మల్లేశం భార్య రజిత (40) మరియు ఆమె తండ్రి శంకరి పెద్ద నర్సయ్య (60) ప్రమాదవశాత్తూ కోటాల్‌పల్లి చెరువులో నీట మునిగి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో, బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు SR ఫౌండేషన్ ముందుకొచ్చింది. మృతి చెందిన రజిత భర్త అయిన సోమిశెట్టి మల్లేశంకు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు జిల్లా గౌరవ అధ్యక్షులు మామిండ్ల అంజయ్య గారు, మాజీ సర్పంచ్ కిషన్ గౌడ్, ఉప సర్పంచ్ సోమిశెట్టి రవి, తుజల్పూర్ మాజీ సర్పంచ్ చెల్లాపురం వెంకట్ గౌడ్, క్యాసంపల్లి తండా సర్పంచ్ భూక్యా శ్రావణ్ నాయక్, H. శ్రీనివాస్ రెడ్డి (Ice cream), A. లక్ష్మణ్ గౌడ్, G. భాస్కర్ రెడ్డి, P. రాజ్‌గోపాల్ రెడ్డి, అలాగే సోమిశెట్టి సాయిలు, సోమిశెట్టి దేవేందర్, వార్డు మెంబర్ స్వామి, తోట మహేందర్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. ఆపదలో ఉన్న కుటుంబానికి సహాయం అందించిన SR ఫౌండేషన్ బృందానికి మరియు పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY