Sircilla: నేడు సిరిసిల్ల జిల్లాలో కవిత పర్యటన.. ఏర్పాట్లు పూర్తి!
Sircilla: తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.
Sircilla: నేడు సిరిసిల్ల జిల్లాలో కవిత పర్యటన.. ఏర్పాట్లు పూర్తి!
సిరిసిల్ల: తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. చందుర్తి మండలం సనుగుల గ్రామంలో నిర్వహించే అమరవీరుల సంస్మరణ సభలో భాగంగా కామ్రేడ్ ఇడుగు శంకరన్న వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.
పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులను పరిశీలించనున్నారు. వేములవాడలోని మున్నూరు కాపు సంఘంలో విలేకరుల సమావేశంలో పాల్గొననున్నారు.
అనంతరం చందుర్తి మండలం సనుగుల గ్రామంలో నిర్వహించే ‘అమరుల యాదిలో’ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ లింగంపల్లి నాగరాజు, కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్ గుంజపడుగు హరి ప్రసాద్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ మజీద్ కార్యక్రమ స్థలాన్ని పరిశీలించారు.
కామ్రేడ్ ఇడుగు శంకరన్న తనయుడు అడ్వకేట్ ఇడుగు రజనీకాంత్‌ను కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ.. కవిత పర్యటనలో భాగంగా భీమేశ్వర స్వామి ఆలయంలో పూజలు, రాజరాజేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ పనుల పరిశీలన, అనంతరం విలేకరుల సమావేశం ఉంటుందని తెలిపారు. సనుగులలో జరిగే అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు, మేధావులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సిరిసిల్ల యువజన నాయకుడు సయ్యద్ జావిద్, ముస్తాబాద్, విన్నపల్లి మండలాల ఇన్‌చార్జులు మార్వాడి దేవరాజు, బండి శ్రీహరి, కోనేటి పరశురాములు, సిద్దు, కరీంనగర్ టౌన్ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, కుతాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




