Kalva Srirampur: రూ.4.90 కోట్లతో బీటీ రోడ్డు.. సంబరాలు
Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ నుంచి చిన్నరాతుపల్లి వరకు రూ.4.90 కోట్లతో బీటీ రోడ్డు మంజూరు కావడంతో కాంగ్రెస్ నేతలు టపాసులు పేల్చి సంబరాలు చేశారు.
Kalva Srirampur: రూ.4.90 కోట్లతో బీటీ రోడ్డు.. సంబరాలు
కాల్వ శ్రీరాంపూర్: గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పనిచేస్తున్నారని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ నుంచి చిన్నరాత్ పల్లి గ్రామానికి పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రత్యేక చొరవతో బీటీ రోడ్ మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపెల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోనీ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనవేన సదయ్య, సర్పంచ్ బంగారి రమేష్ లు తో పాటు కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు హాజరై సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ... కాల్వశ్రీరాంపూర్ నుండి దామన్నకుంట ద్వారా చిన్నరాతుపల్లికి వెళ్లే ఈ రహదారి దాదాపు 60 సంవత్సరాల క్రితమే ఏర్పడిందని తెలిపారు.
ఆ కాలంలోనే ముత్తారం మండలంలోని పలు గ్రామాలతో పాటు ఎద్దులాపూర్, పెద్దరాజుపల్లి, చిన్నరాతుపల్లి, మోట్లపల్లి, కిష్టంపేట గ్రామాల ప్రజలు, పాఠశాల విద్యార్థులు మండల కేంద్రానికి చేరుకోవడానికి ఈ దారినే ఉపయోగించేవారని గుర్తుచేశారు.
కాలక్రమేణా ఈ రహదారి తీవ్ర నిర్లక్ష్యానికి గురై మూలన పడటంతో, రోడ్డు పక్కన పంట పొలాలు ఉన్న రైతులు, గ్రామీణులు ఈ సమస్యను తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే విజయరమణారావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి ₹4.90 కోట్లతో తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని పేర్కొన్నారు.
ఈ రహదారి నిర్మాణం వల్ల రైతులు తమ పంట పొలాలకు వెళ్లడానికి మార్గం సుగమం కావడమే కాకుండా, పరిసర గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి త్వరితగతిన చేరుకోవడానికి సౌకర్యంగా ఉంటుందన్నారు. అంతేకాకుండా మూలనపడ్డ స్థానిక బస్టాండ్ కూడా మళ్లీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించిన ఎమ్మెల్యే విజయరమణారావుకు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్‌తో పాటు సర్పంచ్ బంగారి రమేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజన వేణు మరియు స్థానిక రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజన వేన సదయ్య, సర్పంచ్లు బంగారి రమేష్, జిన్న రామచంద్రారెడ్డి, నాయకులు ఎండీ మున్నీ ర్, సబ్బని రాజమల్లు, మాదాసు సతీష్, అటికం శంకర్ గౌడ్, పొట్యాల మొండయ్య, మేడి అశోక్ గౌడ్, రహీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.




