Kalva Srirampur: పోలీసుల సేవలపై కస్తూర్బా విద్యార్థినులకు అవగాహన!
Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో 'ఓపెన్ హౌస్' నిర్వహించారు. పోలీసుల విధులు, కేసుల నమోదు, రికార్డులపై కస్తూర్బా విద్యార్థినులకు ఎస్సై గట్ల సుధాకర్ వివరించారు.
Kalva Srirampur: పోలీసుల సేవలపై కస్తూర్బా విద్యార్థినులకు అవగాహన!
కాల్వ శ్రీరాంపూర్: పోలీసుల విధులు, చట్టాల అమలు మరియు ప్రజలకు అందించే సేవలపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం "ఓపెన్ హౌస్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్సై గట్ల సుధాకర్ విద్యార్థినులతో మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్‌లో నిర్వహించే రోజువారీ విధులు, ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రను సవివరంగా వివరించారు. అనంతరం స్టేషన్‌లోని లాకప్, రికార్డుల నిర్వహణ, రిసెప్షన్ విభాగాల పనితీరును ప్రత్యక్షంగా చూపించారు.
ఆపద సమయంలో పోలీసుల సహాయం ఎలా పొందాలి, ఫిర్యాదు ఎలా చేయాలి అనే అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై నీలిమ, మహిళా రిసెప్షనిస్ట్ రజిని, సీసీటిఎన్ఎస్ రైటర్ జ్యోతి, పోలీస్ కానిస్టేబుళ్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.




