Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించి, అంబేద్కర్ చౌరస్తాలో నివాళులు అర్పించి స్వీట్లు పంచారు.
Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
కాల్వ శ్రీరాంపుర్: పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ గొపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య తోపాటు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత తొలి మహిళా ప్రధాని, 'ఉక్కు మహిళ' అమరజీవి ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ సమగ్రత, సౌభ్రాతృత్వం కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహోన్నత నాయకురాలు ఇందిరా గాంధీ అని కొనియాడారు.
పేదరికాన్ని తరిమికొట్టేందుకు 'గరీబీ హఠావో' వంటి విప్లవాత్మక నినాదంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, బ్యాంకుల జాతీయకరణ, భూసంస్కరణలు లాంటి నిర్ణయాలతో దేశాన్ని ప్రగతిపథంలో నిలిపారని గుర్తుచేసుకున్నారు. ఆమె చూపిన బాటలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజన వేన సదయ్య, సర్పంచ్లు బంగారి రమేష్, జిన్న రామచంద్రారెడ్డి, నాయకులు ఎండీ మున్నీ ర్, సబ్బని రాజమల్లు, మాదాసు సతీష్, అటికం శంకర్ గౌడ్, పొట్యాల మొండయ్య, మేడి అశోక్ గౌడ్, రహీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.




