Mallapur: మల్లాపూర్‌లో ఇందిరమ్మ పెన్షన్లు, ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ!

Mallapur: మల్లాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు లబ్ధిదారులకు ఇందిరమ్మ పెన్షన్, ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 23 Nov 2026 4:16 PM IST
Mallapur
X

Mallapur: మల్లాపూర్‌లో ఇందిరమ్మ పెన్షన్లు, ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ!

Mallapur: మల్లాపూర్ మండల MPDO కార్యాలయంలో ఇందిరమ్మ పెన్షన్, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ జువ్వాడి నర్సింగ్ రావు హాజరై లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల MPDO, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీ ఎలాల జలపతి రెడ్డి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మాట్ల సోమయ్య , వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA