Manthani: వృద్ధుల సంక్షేమం, సంరక్షణ వారసులదే – జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది
Manthani: మంథని కోర్టు ప్రాంగణంలో వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు. వృద్ధుల సంక్షేమం వారసుల బాధ్యతని తెలిపిన జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది.
Manthani: వృద్ధుల సంక్షేమం, సంరక్షణ వారసులదే – జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది
మంథని: వయోవృద్ధుల సంక్షేమం, సంరక్షణ బాధ్యత వారి వారసులదేనని మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి అపర్ణ మల్లాది అన్నారు.
ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం వృద్ధుల సమస్యలపై రెవెన్యూ డివిజనల్ అధికారి విచారణ జరిపి తగిన ఉత్తర్వులు జారీ చేస్తారని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించిన పక్షంలో కోర్టులు గరిష్ఠంగా మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు.
ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు కె. రఘోత్తం రెడ్డి, సువర్ణ చంద్రశేఖర్ వృద్ధుల సంక్షేమ చట్టంలోని నిబంధనలు, వృద్ధులకు అందుబాటులో ఉన్న న్యాయ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ, సింగరేణి కార్మికుల పెన్షనర్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు కటకం శ్రీనివాస్, సదన్ కుమార్, శశిభూషణ్ కాచె తదితరులు పాల్గొన్నారు.




