Sircilla: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి!

Sircilla: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి పిలుపునిచ్చారు. నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పించారు.

KALEEM, SIRICILLA
Published on: 14 Nov 2026 5:25 PM IST
Sircilla
X

Sircilla: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి!

Sircilla: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి పిలుపునిచ్చారు. బాలలకు నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, రక్షణతో పాటు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు.

భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి, బాలల దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో నెహ్రూ పార్కులో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ చిన్నారులంటే నెహ్రూకు ఎంతో ఇష్టమని, పిల్లలు ఆయనను ఆప్యాయంగా చాచా నెహ్రూ అని పిలిచేవారని గుర్తుచేశారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని అన్నారు. పిల్లల హక్కులను పరిరక్షించడంతో పాటు వారి ఎదుగుదలకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

చిన్నారుల్లో బాల్యం నుంచే క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, దేశభక్తి, కుటుంబ విలువలు, సేవాభావం పెంపొందించాలని సూచించారు. పిల్లలను భయపెట్టి నిరుత్సాహపరచకుండా వారి అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, క్రీడలు, కళలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలపై ఆసక్తి పెంచేలా చూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వేముల రాములు, దార్నం అరుణ లక్ష్మీనారాయణ, ఎర్రం వెంకట్రాజ్యం, దొంతునేని కళ్యాణి అశోక్ రావు, కూర భాగ్యలక్ష్మి దేవరాజ్, ఎలుక వెంకటేశం, అడిచెర్ల రూప సాయి కృష్ణ, బత్తుల రమేష్, రిక్కమల్లె రజిత సంపత్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పాటి కుమార్ రాజు, మాజీ కౌన్సిలర్ రిక్కమల్లె సంపత్ తదితరులు పాల్గొని నెహ్రూకు పూలమాలలతో నివాళులర్పించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA