Jammikunta: జమ్మికుంటలో గోమాతలకు నిలువ నీడ కరువు రోడ్డున పడ్డ మూగజీవాలు

Jammikunta: జమ్మికుంటలో లీజు స్థలం ఖాళీ చేయడంతో నిలిచిపోయిన గోశాల నిర్వహణ. రోడ్లపైనే గోమాతల అవస్థలు.. స్పందించి స్థలం కేటాయించాలని దాతలు, ప్రజల విజ్ఞప్తి.

GANESH, JAMMIKUNTA
Published on: 5 Nov 2026 6:20 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో గోమాతలకు నిలువ నీడ కరువు రోడ్డున పడ్డ మూగజీవాలు

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో 2.11.2026 రోజున శ్రీ విశ్వేశ్వర అన్నపూర్ణ సేవాసమితి వారు చాగంటి కోటేశ్వరరావువారితో ప్రోగ్రాం నిర్వహించారు భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు ప్రజలు మంచి మనసుతో జమ్మికుంటలో గోమాతను పూజించండి మానవత్వాన్ని చాటికోవాలి అని వివరించారు.

ప్రజలకు ఇదే విషయాన్ని మరొక్కసారి జమ్మికుంట ప్రజలు మేమరీ వేసుకున్నారు కొన్ని సంవత్సరాల క్రితం యోగా సభ్యులందరూ కలిసి మానవత్వంతో గోమాతలకు ఆశ్రయం కల్పించాలనే మంచి సంకల్పంతో ఒక ప్రైవేటు స్థలాన్ని లీజుకు తీసుకున్నారు.

దాతల సహకారంతో అక్కడ షెడ్డును దాతల ద్వారా నిర్మించి గోశాలను ఏర్పాటు చేశారు.అది ఏమైంది అందరి నోట ఇదే ఒకప్పుడు ఈ గోశాలలోని గోవులకు మార్కెట్ నుంచి కూరగాయలు, పశుగ్రాసం తీసుకొచ్చి పలువురు దాతలు తమ వంతు సహాయం అందించేవారు. గోమాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంతో ప్రేమతో సేవలు చేశారు.

అయితే ఏదైతే భూమి లీజుకి ఇచ్చిన యజమాని కాలి చేయించడంతో కాలక్రమేణా గోశాల నిర్వహణ నిలిచిపోవడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గోమాతలకు ఆహారం, ఆశ్రయం కల్పించడం కష్టంగా మారింది. గోమాతలలో ఒకటి దూడకు జన్మనిచ్చిన విషయం తెలుసుకున్న యజమానులు వచ్చి గోవును పిల్లను తమ వెంట తీసుకెళ్తున్నారని తెలుసుకున్నారు.

ఈ పరిణామాలతో గోశాల నిర్మాణానికి, నిర్వహణకు సహకరించిన దాతలు కూడా వెనక్కి తగ్గారు. ప్రస్తుతం గోమాతల పరిస్థితిని పట్టించుకునే వారు లేకపోవడంతో వాటి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి!

గోశాల నిర్వహణకు ప్రభుత్వ స్థలం కేటాయిస్తే ముందుకు వచ్చి గోమాతలను సంరక్షిస్తామని పలువురు దాతలు చెబుతున్నారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే గోవులకు అవసరమైన వసతులు కల్పించి గోశాలను తిరిగి అభివృద్ధి చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నారు.

మూగజీవాలకు ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. గోమాతలకు మళ్లీ మంచి రోజులు వస్తాయా? ప్రభుత్వ పెద్దలు స్పందిస్తారా? అనేది వేచి చూడాలి.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA