Jammikunta: మార్కెట్లో పత్తి రైతులకు అధికారుల చొరవతో మంచి గిట్టుబాటు ధర!
Jammikunta: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు పత్తిని తీసుకొచ్చిన రైతులకు మార్కెట్ అధికారుల చొరవతో మంచి గిట్టుబాటు ధర లభించింది.
Jammikunta: మార్కెట్లో పత్తి రైతులకు అధికారుల చొరవతో మంచి గిట్టుబాటు ధర!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి వ్యవసాయ మార్కెట్ కు 149 వాహనాలలో పత్తి తీసుకొచ్చిన రైతులు ప్రభుత్వం ధర 6667 రూపాయలు పత్తికి జమ్మికుంట మార్కెట్కు తీసుకువచ్చిన రైతన్ననికి పత్తి తేమశాతం ఉండడం వల్ల కొనుగోలుదారులు ఖరీదుదారులు మిల్లర్లుతో రైతులకు గిట్టుబాటు ధర రావాలని ఉద్దేశంతో మార్కెట్ చైర్ పర్సన్. వైస్ చైర్మన్ డైరెక్టర్లు కార్యదర్శి బండి బండికి వెంబడి ఉండి రైతాంగానికి ధర వచ్చే విధంగా అనుకూలంగా ధరలు పెట్టించారు.
8800 రెండు మూడు బండలకు ఈ ధర పలకగా మిగతా వాహనాలకు 8600.8500 బండి బండికి తేడాలు చూసి ధరలు పెట్టించారు రైతులు కొంచెం సంతోషం వ్యక్తం చేశారు పండుగ దినం కాబట్టి మాకు ఖర్చులు ఉన్నాయి పెట్టుబడి పెట్టినాము మార్కెట్కు తీసుకొచ్చిన పత్తి కూలికి వచ్చిన వారు ఆగడం లేదని అందుకే ఎంతో కొంత ధరలకు అమ్ముకుంటున్నామని రైతులు ఆశించిన ధరలు9000 రావాల్సి ఉండగా వస్తదని అనుకొని ఇంటికాడీ నుంచి మార్కెట్కు తీసుకొచ్చినామని ఆయన ఈ ధర కూడా కొంచెం సంతోషం అనిపిస్తుందని రైతులు వ్యక్తం చేశారు.
అసలే కాలం సరిగా కాలేదని పంట కూడా సరిగా రాకపోయేసరికి వచ్చినప్పటికీ ఈ ధర అయినా రావడం చాలా సంతోషమని దగ్గరుండి ధరలు పెట్టించిన అధికారులకు సంతోషం వ్యక్తం చేశారు. మార్కెట్ చైర్పర్సన్ పొల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ రేపు శుక్రవారం ఒక్కరోజు మార్కెటు మాత్రమే ఉంటదని మిగతా శనివారం ఆదివారం సోమవారం హాలిడేస్ అని మళ్ళీ మార్కెట్ మంగళవారం రోజున రైతులు మార్కెట్కు పత్తిని ఆరబెట్టి మంచి ధర పొందాలని అన్నారు.




