Jammikunta: కేవీ నారాయణరెడ్డి సేవలు చిరస్మరణీయం: ప్రొఫెసర్ రామస్వామి!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యవస్థాపకులు కీ.శే. కేవీ నారాయణరెడ్డి విగ్రహాన్ని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు నన్న రామస్వామి ఆవిష్కరించారు.
Jammikunta: కేవీ నారాయణరెడ్డి సేవలు చిరస్మరణీయం: ప్రొఫెసర్ రామస్వామి!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ నన్న రామస్వామి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల వ్యవస్థాపకులు కీ.శే. మాన్యశ్రీ కె.వి. నారాయణ రెడ్డి విగ్రహాన్ని పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అధ్యక్షులు చేతుల మీదగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ఒక గొప్ప లక్ష్యంతో 1965 సంవత్సరంలో మాన్యశ్రీ నారాయణ రెడ్డి జమ్మికుంటలో ఆదర్శ కళాశాల పేరు మీదగా కళాశాలను స్థాపించారన్నారు. జమ్మికుంటలో కళాశాలను ఏర్పాటు చేయడం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంగా మారిందన్నారు.
నాటి నుండి నేటి వరకు వేలల్లో విద్యార్థులు చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగారన్నారు. అలాంటి గొప్ప నాయకుడు ఈ కళాశాలను స్థాపించడం ఈ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. రమేష్ , పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు మీర్ అహ్మద్ హుస్సేన్, మొలుగూరి సదయ్య, మైస మహేందర్, అన్వర్ బాబు, డా. కె. రాజేంద్రం, బచ్చు భాస్కర్, శివకుమార్, ఆకుల రాజేందర్, టి. రాజ్ కుమార్, జగదీశ్వర్, సయ్యద్ సజ్జు, ప్రసాద్, సుధాకర్, సాయికుమార్, అరుణ్ రాజ్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




