Jammikunta: జమ్మికుంటలో ఇందిరా గాంధీ వర్ధంతి.. ఘనంగా నివాళులు
Jammikunta: జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఇందిరా గాంధీ వర్ధంతి. సుంకరి రమేష్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.
Jammikunta: జమ్మికుంటలో ఇందిరా గాంధీ వర్ధంతి.. ఘనంగా నివాళులు
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ మాట్లాడుతూ ఇందిరా ప్రియదర్శిని గాంధీ నవంబర్ 19 1917 - అక్టోబర్ 31 1984)
భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా ఆమె 1966 నుండి 77 వరకు వరుసగా మూడు పర్యాయాలు 1980లో నాలుగవ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె జవహర్ లాల్ నెహ్రూ కి మొదటిసారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి కి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసింది 1964 సంవత్సరంలో తండ్రి మరణం తర్వాత రాజ్యసభకు ఎన్నికై లాల్ బహుదూర్ శాస్త్రి మంత్రి మండలి లో రాజ్యసభకు ఎన్నికై లాల్ బహుదూర్ శాస్త్రి మంత్రి మండలి లో ప్రసార శాఖ మంత్రిగా పనిచేసింది అని కొనియాడారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ టి పి సి సి ఎగ్జిక్యూటివ్ నెంబర్ సాయిని రవి కాంగ్రెస్ కౌన్సిలర్లు శీపతి నరేష్ పొనగంటి విష్ణు దిడ్డి రామ్మోహన్ కుతాడి తిరుపతి చందరాజు గడ్డం దీక్షిత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ యస్సి సెల్ మండల అధ్యక్షులు దొగ్గల భాస్కర్ పిట్టల రమేష్ పొన్నగంటి మధు పంజాల అజయ్ యం డిసలీం పాత ప్రసాద్ పాతకాల ప్రవీణ్ గుఱ్ఱం ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




