Jammikunta: నవంబర్ 22న చలో మేడారం మహాపాదయాత్ర పోస్టర్ విడుదల
Jammikunta: ఉద్యమకారుల హామీల అమలు కోసం నవంబర్ 22న మేడారంలో మహాపాదయాత్ర చేపట్టనున్నట్లు ఎక్కడి సంజీవరెడ్డి వెల్లడించి, జమ్మికుంటలో పోస్టర్ ఆవిష్కరించారు.
Jammikunta: నవంబర్ 22న చలో మేడారం మహాపాదయాత్ర పోస్టర్ విడుదల
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట శంకర నందన గార్డెన్లో ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసి, అలుపెరుగని పోరాటాలు సాగించిన ఉద్యమకారుల హక్కుల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధమవుతున్నామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఎక్కడి సంజీవరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 22న మేడారంలో నిర్వహించనున్న ‘సమ్మక్క–సారలమ్మ చలో మేడారం’ మహాపాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా చలో మేడారం మహాపాదయాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు తమ కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను సైతం పక్కనపెట్టి ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. వారి త్యాగాలు, పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని పేర్కొన్నారు. అలాంటి ఉద్యమకారులకు నేటికీ తగిన గుర్తింపు, గౌరవం, ప్రభుత్వపరమైన భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు పలు హామీలు ఇచ్చిందని, ఆ హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, వాటి అమలు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు హక్కుల సాధన కోసం ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు మేడారంలో మహాపాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. మేడారంలోని జంపన్న వాగు నుంచి ప్రారంభమై సమ్మక్క–సారలమ్మ గద్దెల వరకు ఈ మహాపాదయాత్ర కొనసాగుతుందని వివరించారు.
సమ్మక్క–సారలమ్మల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ప్రతి ఉద్యమకారుడు ఈ మహాపాదయాత్రలో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారం, మేనిఫెస్టో హామీల అమలు లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఉద్యమ సంఘాలు, ప్రజాసంఘాలు, తెలంగాణ అభిమానులు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ, ములుగు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈ మహాపాదయాత్ర నిర్వహించనున్నట్లు సంజీవరెడ్డి వెల్లడించారు.
తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు న్యాయం జరగాలి.. వారి త్యాగాలకు తగిన గుర్తింపు లభించాలి.. ఇచ్చిన హామీలు అమలులోకి రావాలి.. అనే లక్ష్యంతో చేపడుతున్న చలో మేడారం మహాపాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ జనరల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎక్కడ సంజీవరెడ్డి కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ అధ్యక్షులు మూడేడ్ల కుమారస్వామి హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఆరే jరమేష్ రెడ్డి మోతే స్వామి పాతకాల ఓదెలు . రచ్చ గణేష్ బిట్ల రమేష్ బిట్ల శ్రీనివాస్. కొంగరి రవీందర్ ఏ బి సి ఓదెలు. పెరమళ్ళ సుదర్శన్ గౌడ్ ఇల్లందుల శ్రీనివాస్. ఎజ్జ తిరుపతి. పోచం వెంకన్న. కన్నూరి శ్రీనివాసు. గడ్డి కొమురయ్య గడ్డి రాములు తోడేటి జితేందర్. యమ శ్రీనివాసు. అన్నారపు వీరస్వామి. గాజ రాజయ్య. అబ్బీడి శ్రీపాల్ రెడ్డి . దాసరి తిరుపతిరెడ్డి బండి మల్లయ్య ఉప్పుల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




