Jagtial: జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

Jagtial: జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

ANAND, JAGITYAL
Published on: 8 Oct 2026 5:07 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

జగిత్యాల: తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) ప్రిన్సిపాల్ ఆచార్య కె. రామకృష్ణ అన్నారు. గురువారం కళాశాలలోని మహిళా సాధికారత విభాగం (డబ్ల్యూఈసీ) ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి ముఖ్య అతిథిగా, సీపీడీసీ సెక్రటరీ డాక్టర్ జి. శ్రీలత విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థినులు చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సంప్రదాయ దుస్తుల్లో విచ్చేసిన విద్యార్థినులు, రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడుతూ, పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.

కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డబ్ల్యూఈసీ కన్వీనర్ డాక్టర్ ఎన్. వాసవి, స్టాఫ్ సెక్రటరీ డాక్టర్ ఎన్. సంగీత రాణిలను ప్రిన్సిపాల్ అభినందించారు. ఈ సంబరాల్లో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. ప్రమోద్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. చంద్రయ్య, అధ్యాపకులు వి. వరప్రసాద్, జి. రాం చంద్రమ్, జి. నీరజ, డాక్టర్ డి. సుజాత, ఎస్. మల్లికార్జున్, డాక్టర్ జమున తదితరులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL