Jagtial: వెంగళాయిపేటలో పిల్లి బీభత్సం: ఆరుగురికి గాయాలు!

Jagtial: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయిపేటలో ఓ పిల్లి ఆరుగురిపై దాడి చేసి గాయపరిచింది. సర్పంచ్ చొరవతో వల వేసి పిల్లిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు.

RAMESH, DHARMPURI
Published on: 9 Nov 2026 8:25 PM IST
Jagtial
X

Jagtial: వెంగళాయిపేటలో పిల్లి బీభత్సం: ఆరుగురికి గాయాలు!

జగిత్యాల: సాధారణంగా కుక్కలు, కోతులు మనుషులపై దాడి చేయడం చూస్తుంటాం కానీ ఓ పిల్లి ఏకంగా ఆరుగురిపై దాడి చేసి గాయపరచిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయిపేట గ్రామంలో కలకలం రేపింది. గ్రామంలో ఓ పిల్లి పలువురిపై దాడి చేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల దృష్టికి తీసుకెళ్లడంతో సర్పంచ్ స్పందించి చేపలు పట్టే వారి సహాయంతో వల తో పిల్లిని బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. సమస్యపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్న సర్పంచ్, ఉప సర్పంచ్‌కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI