Jagtial: ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం డాక్టర్ సంజయ్

Jagtial: జగిత్యాల పాత బస్టాండ్ వద్ద ఇందిరాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నివాళులు అర్పించి, ఇందిరమ్మ బీమా దరఖాస్తుల వివరాలను వెల్లడించారు.

ANAND, JAGITYAL
Published on: 19 Nov 2026 5:44 PM IST
Jagtial
X

Jagtial: ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం డాక్టర్ సంజయ్

జగిత్యాల: జగిత్యాల, భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సమగ్రత, సమైక్యత, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జగిత్యాలలోని అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఆమె హయాంలో ఏర్పాటైనవేనని గుర్తుచేశారు.

ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం' దరఖాస్తుల స్వీకరణ జగిత్యాల పట్టణంలోని 31 వేల కుటుంబాలకు రేపటి నుండి ప్రారంభం కానుందని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజల పక్షాన ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజెంగి నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్, జిల్లా సర్పంచుల ఫోరం నేత బొలిశెట్టి గంగారెడ్డి, తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL