Jagtial: హాకా రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్!
Jagtial: జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్‌లో హాకా రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు.
Jagtial: హాకా రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్!
Jagtial: జగిత్యాల రైతులకు తక్కువ ధరలకే ఎరువులు, విత్తనాలు అందించడమే లక్ష్యంగా జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ సమీపంలోని AR గార్డెన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హాకా (HAKA) రైతు సేవా కేంద్రాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వానాకాలం వరి కోతల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. రేపు చల్గల్లో పాక్స్ (PACS) ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు నీరు, విద్యుత్‌ను పొదుపు చేస్తూ ఆరుతడి, తక్కువ వ్యవధి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గజంగి నందయ్య, AMC చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, PACS చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.




