Jagtial: జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో చెక్కుల పంపిణీ
Jagtial: జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాదీ ముబారక్, CMRF పథకాల కింద ₹5.50 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు.
Jagtial: జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో చెక్కుల పంపిణీ
జగిత్యాల: జగిత్యాల పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ పథకాల చెక్కులను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు.
గురువారం జగిత్యాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షాదీ ముబారక్ పథకం కింద 4 గురు లబ్ధిదారులకు మంజూరైన రూ. 4 లక్షల విలువైన చెక్కులతో పాటు, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన రూ. 1,50,000 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, వికలాంగ మరియు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సీఎం ఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని, షాదీ ముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




