Jagtial: కన్నాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే సంజయ్
Jagtial: జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ మాజీ సర్పంచ్ సిరిగిరి తిరుపతి–భాగ్య దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరయ్యారు.
Jagtial: కన్నాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ సిరిగిరి తిరుపతి–భాగ్య దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నూతన గృహంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొని, అనంతరం తిరుపతి–భాగ్య దంపతులకు పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ పథకం ద్వారా నిర్మించుకున్న నూతన గృహంలో వారు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, సీనియర్ నాయకులు సమిండ్ల శ్రీనివాస్, కౌన్సిలర్ కూతురు రాజేష్, స్థానిక గ్రామ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




