Jagtial: విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్
Jagtial: జగిత్యాల రూరల్ మండలం హైదర్ పల్లి, వంజరుపల్లి గ్రామాల్లో జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని పూజలు చేశారు.
Jagtial: విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలంలోని హైదర్ పల్లి, వంజరుపల్లి గ్రామాల్లో జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా హైదర్ పల్లి గ్రామంలో జరిగిన సార్గమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వంజరుపల్లి గ్రామంలోని ఐలేని ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న మల్లన్న స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అమ్మవార్లు, స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో పీఏసీఎస్ చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, సర్పంచులు చంద్రశేఖర్, గంగమల్లయ్య, కౌన్సిలర్ కూతురు రాజేష్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ కుడకల లక్ష్మణ్, మాజీ ఉపసర్పంచులు గంగాధర్, హరీష్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, వంశీ, రవి, మహేష్, కృష్ణ తదితరులతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




