Mettupally: మెట్టుపల్లి కెమెరా క్లబ్ ఎన్నికలు ప్రశాంతం: నూతన కార్యవర్గం

Mettupally: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి కెమెరా క్లబ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో ప్రశాంతంగా ముగిశాయి; నూతన బాధ్యుల ఎన్నిక పూర్తయింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Sept 2026 4:30 PM IST
Mettupally
X

Mettupally: మెట్టుపల్లి కెమెరా క్లబ్ ఎన్నికలు ప్రశాంతం: నూతన కార్యవర్గం

​మెట్టుపల్లి: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి కెమెరా క్లబ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ముగిశాయి. సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించేలా అసోసియేషన్ సభ్యులు బ్యాలెట్ పద్ధతి ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

​అత్యంత పారదర్శకంగా సాగిన ఈ పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం ఫలితాలను రాష్ట్ర, జిల్లా కమిటీ ప్రతినిధులు అధికారికంగా వెల్లడించారు.

​​అధ్యక్షులుగా జోగ జ్ఞానేశ్వర్, ​ప్రధాన కార్యదర్శిగా అల్లే మనోజ్, ​ఉపాధ్యక్షుడుగా ఎండి అజారుద్దీన్ ​కోశాధికారిగా చిలువేరి మహేష్ గౌడ్ లు ​గెలుపొందగా వారికి రాష్ట్ర, జిల్లా కమిటీల ప్రతినిధులు నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ అభివృద్ధికి, ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కెమెరా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్