Metpally: మెట్‌పల్లిలో ఆటో బోల్తా: మహిళ దుర్మరణం, 10 మందికి గాయాలు!

Metpally:జగిత్యాల జిల్లా మెట్‌పల్లి శివారులో కుక్క అడ్డం రావడంతో ఆటో బోల్తా పడి నాగెల్లి లస్మవ్వ మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 11 Nov 2026 8:30 PM IST
Metpally
X

Metpally: మెట్‌పల్లిలో ఆటో బోల్తా: మహిళ దుర్మరణం, 10 మందికి గాయాలు!

మెట్టుపల్లి: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణ శివారులో విషాదం చోటుచేసుకుంది. మెట్టుపల్లి నుంచి బండలింగాపూర్ గ్రామానికి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో, ఉన్నట్టుండి రహదారిపైకి కుక్క అడ్డంగా రావడంతో డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. కుక్కను తప్పించే క్రమంలో ఆటో వేగంగా వచ్చి బోల్తా పడింది. ​ఈ ప్రమాదంలో బండలింగాపూర్ గ్రామానికి చెందిన నాగెల్లి లస్మవ్వ అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో 10 మందిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

​స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని మెట్టుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం విషమంగా ఉన్న వారిని మెరుగైన వైద్యం ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA