Jagtial: జగిత్యాల గ్రంథాలయ వారోత్సవాల్లో కెరీర్ గైడెన్స్ సదస్సు!

Jagtial: జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సు జరిగింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ANAND, JAGITYAL
Published on: 18 Nov 2026 2:45 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాల గ్రంథాలయ వారోత్సవాల్లో కెరీర్ గైడెన్స్ సదస్సు!

జగిత్యాల: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా, పట్టణంలోని పొన్నాల గార్డెన్స్‌లో విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, లక్ష్య నిర్దేశం, ఉన్నత విద్యలో ఉన్న విస్తృత అవకాశాలు, భవిష్యత్తులో సరైన కెరీర్ ఎంపిక వంటి అంశాలపై నిపుణులు సమగ్ర అవగాహన కల్పించారు. గ్రంథాలయాలు కేవలం పుస్తక పఠనానికే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే జ్ఞాన కేంద్రాలుగా నిలుస్తున్నాయని వక్తలు పేర్కొన్నారు. ఇలాంటి అవగాహన సదస్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్లు జంబర్తి గంగ లక్ష్మీరాజ్ కుమార్, పంబాల సుజాత రాము కుమార్, సీనియర్ నాయకులు రేపల్లె హరికృష్ణ, వ్యక్తిత్వ వికాస నిపుణులు సంగనభట్ల దివాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL