Jagtial: రేవంత్‌ని సస్పెండ్ చేసి.. రాష్ట్రపతి పాలన విధించాలి

Jagtial: కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రేవంత్ రెడ్డిని తొలగించి రాష్ట్రపతి పాలన విధించాలని జగిత్యాలలో జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ చేశారు.

ANAND, JAGITYAL
Published on: 15 Oct 2026 7:36 PM IST
Jagtial
X

Jagtial: రేవంత్‌ని సస్పెండ్ చేసి.. రాష్ట్రపతి పాలన విధించాలి

జగిత్యాల: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సీఎం రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాలలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా దారుణంగా తయారైందని, ఎల్-నినో ప్రభావం ఉంటుందని తెలిసి కూడా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికి ముందస్తు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య ఉన్న అంతర్గత విభేదాల వల్లే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పదవి నుంచి దిగిపోతేనే రైతులకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే నాటకాలు ఆడుతోందని విమర్శించారు.

అనంతరం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వెళ్లని విధంగా రేవంత్ రెడ్డి రికార్డు స్థాయిలో ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లలేదని ఆయన విమర్శించారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL