Jagtial: జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడువాల జ్యోతి లక్ష్మణ్ నియామకం!
Jagtial: జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడువాల జ్యోతి లక్ష్మణ్ నియామకం. నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ.
Jagtial: జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడువాల జ్యోతి లక్ష్మణ్ నియామకం!
Jagtial: జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జగిత్యాల పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో మహిళా కాంగ్రెస్ కమిటీని మరింత బలోపేతం చేయడంతో పాటు, మహిళలను రాజకీయంగా చైతన్యవంతులను చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను నిరుపేద మహిళలందరికీ చేరేలా చూస్తామని అన్నారు.
తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మరియు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్యలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.




