Peddapalli: PMJJBY పథకం కింద మృతుని కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందజేత!

Peddapalli: పెద్దపల్లి జిల్లా సబితం IOB ఖాతాదారుడు అగ్గి శ్రావణ్ మృతి చెందడంతో, ఎల్ఐసీ ద్వారా మంజూరైన రూ.2 లక్షల PMJJBY బీమా చెక్కును కుటుంబ సభ్యులకు అధికారులు అందజేశారు.

RAJU, PEDDAPALLI
Published on: 3 Nov 2026 4:49 PM IST
Peddapalli
X

Peddapalli: PMJJBY పథకం కింద మృతుని కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందజేత!

Peddapalli: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకం కింద మృతుని కుటుంబానికి రూ.2 లక్షల బీమా పరిహారం అందజేశారు.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సబితం శాఖ (3182) పరిధిలో అగ్గి శ్రావణ్ అనే ఖాతాదారుడు PMJJBY పథకం కింద బీమా చేయించుకున్నారు. ఆయన మృతి చెందడంతో నిబంధనల ప్రకారం ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ద్వారా మంజూరైన రూ.2,00,000/- చెక్కును బ్యాంకు అధికారులు సోమవారం లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు.

చెక్కుపై తేదీ 29/10/2026 గా ఉంది. పేద కుటుంబానికి కేంద్ర ప్రభుత్వ బీమా పథకం ఎంతో అండగా నిలిచిందని ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ తక్కువ ప్రీమియంతో వచ్చే PMJJBY, PMSBY పథకాలలో చేరి బీమా రక్షణ పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రమేష్ గారు అసిస్టెంట్ మేనేజర్ దేవాన్ష్ క్యాషియర్ సదయ్య గారు సిబ్బంది, లబ్ధిదారుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI