Karimnagar: ఆర్టీసీ యూనియన్ల ఏకగ్రీవ నిర్ణయం: అంజన్ కుమార్, చక్రధర్ రావు ఎన్నిక!

Karimnagar: కరీంనగర్ 1, 2 ఆర్టీసీ డిపోల గౌరవ అధ్యక్షులుగా వైద్యుల అంజన్ కుమార్, రాచకొండ చక్రధర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 4 Oct 2026 7:32 PM IST
Karimnagar
X

Karimnagar: ఆర్టీసీ యూనియన్ల ఏకగ్రీవ నిర్ణయం: అంజన్ కుమార్, చక్రధర్ రావు ఎన్నిక!

కరీంనగర్: కరీంనగర్ వన్ డిపో గౌరవ అధ్యక్షులుగా వైద్యుల అంజన్ కుమార్, టు డిపో గౌరవ అధ్యక్షులుగా రాచకొండ చక్రధర్ రావు లను కాంగ్రెస్ అనుబంధ సంస్థలైన ఐ. ఎన్. టి యు సి, ఎస్.డబ్ల్యూ.యు, టి.డబ్ల్యూ.యు, ఎస్.డబ్ల్యూ. ఎఫ్, యూనియన్ నాయకులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా అంజన్ కుమార్, రాచకొండ చక్రధర్ రావు మాట్లాడుతూ.. అక్టోబర్ 9న జరిగే ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంద సంస్థ నుండి పోటీ చేసే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ కి బహుమతిగా ఇవ్వాలని అన్నారు. కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చిన తమ దృష్టికి తీసుకువస్తే మంత్రి తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.

ఈ సమావేశంలో నాయకులు టి. ఆర్.రెడ్డి, రాజు, ఐ. ఎన్.టి యు.సి, ఎస్.డబ్ల్యూ.యు, టి. డబ్ల్యూ.యు, ఎస్.డబ్ల్యూ.ఎఫ్, కి చెందిన నాయకులు మరియు వన్, టూ, డిపోలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN