Dharmaram: అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్.. 10 బైకులు స్వాధీనం
Dharmaram: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను ధర్మారం పోలీసులు అరెస్ట్ చేసి 10 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
Dharmaram: అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్.. 10 బైకులు స్వాధీనం
Peddapalli: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న అంతర్ రాష్ట్ర బైక్ దొంగను పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీసులు అరెస్టు చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం జక్కనపల్లి వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన కండ్ల బాపన్నను అదుపులోకి తీసుకుని విచారించగా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సుమారు 10 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు విచారణలో తేలిందని నిందితుడు దొంగిలించిన పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు, ఈ కేసును ఛేదించి, నిందితుడిని పట్టుకోవడంతో పాటు బైక్లను స్వాధీనం చేసుకున్న ధర్మారం పోలీసులను ఏసీపీ గజ్జి కృష్ణ ప్రత్యేకంగా అభినందించారు.




