Illanthakunta: పేదల ఆత్మగౌరవ పతాకం ఇందిరమ్మ ఇండ్లు: అన్నం ప్రవీణ్

Illanthakunta: కరీంనగర్ జిల్లా పాతర్లపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల భూమిపూజ జరిగింది. పేదల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రతీక అని కాంగ్రెస్ నేత అన్నం ప్రవీణ్ అన్నారు.

GANESH, JAMMIKUNTA
Published on: 11 Nov 2026 3:04 PM IST
Illanthakunta
X

Illanthakunta: పేదల ఆత్మగౌరవ పతాకం ఇందిరమ్మ ఇండ్లు: అన్నం ప్రవీణ్

కరీంనగర్ జిల్లా: ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి గ్రామంలో కోడం శ్రీలత విజేందర్ హనుమాండ్ల రమాదేవి జయపాల్ రెడ్డి ఇందిరమ్మ పథకం ద్వారా మంజూరైన ఇండ్ల భూమి పూజ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నం ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్ల జాతర జరుగుతుందని, పేదల సొంత ఇంటి కల నెరవేరుతుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ చొరవతో ఇప్పటికే పాతర్లపల్లి గ్రామానికి 30 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇల్లు అనేది ప్రతి మనిషి కల. సొంతింటి కలను నిజం చేసుకోవడం ప్రతి పేద కుటుంబం ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చే గొప్ప లక్ష్యంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని. గతంలో పేదలు సొంత ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అద్దె ఇళ్లలో ఉంటూ, కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోవడం ఎంతో కష్టంగా ఉండేదని.

అలాంటి పేద ప్రజల కష్టాలను గుర్తించి, వారికి ఆత్మగౌరవంతో కూడిన జీవనాన్ని అందించాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. మన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది ఒక పేద కుటుంబానికి భరోసా. పిల్లలకు భద్రమైన భవిష్యత్తు. మహిళలకు ఆత్మగౌరవం.ఒక కుటుంబానికి శాశ్వత చిరునామా.

ఈ పథకం ద్వారా సొంతింటి కల సాకారం కావాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, ఎలాంటి వివక్షకు తావులేకుండా పారదర్శకంగా పథకం అమలు అవుతుండి.

గత కెసీఆర్ హయాంలో 10 ఏళ్లలో ఒక ఇల్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి తెలంగాణలో గొప్పగా అమలు అవుతుందని, మనకు మంచి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని అన్నం ప్రవీణ్ కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బైరెడ్డి రమణారెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కోడం శ్రీనివాస్, బైరెడ్డి కొండల్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA