Manthani: సిద్దిపల్లెలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

SHANKAR, MANTHANI
Published on: 3 Nov 2026 1:31 PM IST
Manthani
X

Manthani: సిద్దిపల్లెలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులైన మాటేటి అంజమ్మ, గాజుల మల్లక్క, నామని స్వరూప, ఓడ్నాల లత, మబ్బు రాజేశ్వరి తదితరులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ అన్వర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు, గ్రామ సర్పంచ్ బంగారు కళ్యాణి మహేష్ చేతుల మీదుగా మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన పేదలందరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, అర్హులైన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి జంజర్ల అమల, కమాన్‌పూర్ గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ, ఉపసర్పంచ్ కొత్తపల్లి సతీష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెబల్ రాజ్ కుమార్, వార్డు సభ్యులు కురుమ శిరీష, బిల్లా వెంకటేష్, కొలిపాక వెంకన్న, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గడ్డం శ్రీనివాస్, చిప్ప రాజకుమార్, కుచన రవి, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI