Sircilla: సిరిసిల్ల 4వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం!

Sircilla: రాజన్న సిరిసిల్ల పట్టణంలోని 4వ వార్డులో కౌన్సిలర్ లైఖ్ సుల్తానా-తాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సంగీతం శ్రీనివాస్ ప్రారంభించారు.

KALEEM, SIRICILLA
Published on: 20 Nov 2026 4:08 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల 4వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం!

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని 4వ వార్డులో కౌన్సిలర్ లైఖ్ సుల్తానా-తాజ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, సిరిసిల్ల పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ రఫీక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA